
కనీస వేతనం రూ.26 వేలు అందించాలి
చిన్నశంకరంపేట(మెదక్): అసంఘటిత కార్మికులకు కనీస వేతనం అందించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో అసంఘటిత కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కిందిస్థాయి ఉద్యోగులతో వెట్టిచాకిరి చేయించుకునే శ్రద్ధ వేతనాలు అందించడంలో పెట్టడం లేదన్నారు. గ్రామాల్లో అంగన్‌వాడీ, ఆశావర్కర్లు, ఐకేపీ వీఓలు, ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏఎన్‌ఎంలు కీలక సేవలు అందిస్తున్నా ప్రభుత్వం వేతనాలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. అసంఘటిత కార్మికులను రెగ్యూలర్ చేయడంతో పాటు కనీస వేతనం రూ.26 వేలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జీపీ వర్కర్స్ యూనియన్ నాయకులు రాములు, సత్యనారాయణ, రాజు, యాదమ్మ, ఆశ యూనియన్ నాయకులు రేణుక, విద్యుత్ కార్మిక సంఘం నాయకులు నర్సింహులు, ఈజీఎస్ ఎఫ్‌ఏల సంఘం నాయకులు నర్సింహులు ఉన్నారు.
సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం