
ఆర్టీసీ ప్రయాణికులకు బహుమతులు
నర్సాపూర్: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు డ్రా పద్ధతిలో తమ సంస్థ బహుమతులు అందించనున్నట్లు డిపో మేనేజర్ సురేఖ చెప్పారు. ఈనెల 27నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు మెదక్ నుంచి సికింద్రాబాద్ మార్గంలో ఆర్‌టీసీకి చెందిన డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే వారికి అవకాశం ఉంటుందన్నారు. డీలక్స్ బస్సుల్లో ప్రయాణం ముగిసిన అనంతరం వారి టికెట్ వెనకాల అడ్రస్ రాసి జేబీఎస్, మెదక్, నర్సాపూర్ బస్టాండ్‌లలో ఏర్పాటు చేసిన గిఫ్ట్ బాక్సుల్లో టికెట్లు వేయాలని ఆమె సూచించారు. ఆ తర్వాత ఇందులోని టికెట్లను డ్రా తీసి మొదటి బహుమతిగా రూ.25వేలు, రెండవ బహుమతిగా రూ.15వేలు, మూడవ బహుమతిగా రూ.10 వేలు అందజేయనున్నట్లు ఆమె చెప్పారు.
పౌష్టికాహారంతోనే ఆరోగ్యం
ఐసీడీఎస్ సూపర్‌వైజర్ శ్రీశైల
టేక్మాల్(మెదక్): గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యమని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ శ్రీశైల తెలిపారు. శుక్రవారం మండలంలోని ఎల్లుపేట అంగన్‌వాడీలో పోషకాహార మాసోత్సవంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్ సరిత, పంచాయతీ కార్యదర్శి మహేష్ కుమార్, ఏఎన్‌ఎం కృష్ణవేణి, ఆశావర్కర్ రాణి తదితరులు పాల్గొన్నారు.