
మద్యం టెండర్లకు వేళాయె..
నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
2025– 27 కొత్త మద్యం పాలసీని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. మద్యం దుకాణాల కేటాయింపు.. షెడ్యూల్‌ను గురువారం విడుదల చేసింది. నేటి నుంచి మద్యం షాపులకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించనుంది. 2023– 25 మద్యం పాలసీ ఈ ఏడాది నవంబర్ 30తో ముగియనుంది.
– మెదక్ అర్బన్
జిల్లావ్యాప్తంగా ఉన్న 49 వైన్ షాపులకు శుక్రవారం నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 23న లక్కీ డ్రా తీయనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పా టు చేయనున్నారు. ఇందులో షాపు దక్కించుకున్న వ్యాపారులు అదే రోజు, మరునాడు లైసెన్స్ ఫీజుకు సంబంధించి మొదటి వాయిదా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ 1 నుంచి కొత్త వైన్స్ షాపులు ప్రారంభం కానున్నాయి. ఈసారి దర ఖాస్తు ధరను రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచారు. ఐదు వేల నుంచి 50 వేల జనాభా ఉన్న షాపులకు రూ. 55 లక్షలు, 50 వేల నుంచి లక్ష వరకు రూ. 60 లక్షలు, లక్ష నుంచి ఐదు లక్షల జనాభా వరకు రూ. 65 లక్షల ఫీజును వసూలు చేయనున్నారు. కాగా ఈసారి ఏడుపాయల కమాన్ (చిత్రియాల్) వద్ద ఉన్న వైన్ షాపును కొల్చారం మండలం పోతంషెట్‌పల్లి– అప్పాజిపల్లి శివారులోకి మార్చారు. కాగా మద్యం సిండికేట్ సభ్యులు వైన్స్ టెండర్లలో ఎక్కువగా పాల్గొనే అవకాశం ఉంది. దరఖాస్తు ఫీజు ఎక్కువగా ఉండటంతో కొంతమంది సిండికేట్‌గా ఏర్పడి టెండర్లు వేస్తూ వ్యాపారం చేస్తుంటారు. ఒక్కో వ్యాపారి 20 నుంచి 60 దరఖాస్తులు సమర్పిస్తారు.
మరింత ఆదాయం సమకూరే అవకాశం
జిల్లాల్లో ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలు కావడంతో వైన్స్ షాపుల టెండర్లకు భా రీగా దరఖాస్తులు వచ్చే అవకాఽశం ఉందని భావిస్తున్నారు. 2021లో జిల్లాలో 832 దరఖాస్తులు రాగా, 2023లో 1,905 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో అత్యధికంగా పోతంషెట్‌పల్లి వైన్ షాపుకు 111 దరఖాస్తులు వచ్చాయి. కాగా ఆ దుకాణం, వైన్‌షాపులో పని చేస్తున్న వర్కర్‌కు దక్కడం విశేషం. గతేడాది కేవలం అప్లికేషన్ రుసుం ద్వారా రూ. 38.10 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి దరఖాస్తు ఽఫీజు రూ. 3 లక్షలకు పెంచడంతో మరింత ఆదాయం సమకూరే అవకాశం ఉంది. గతేడాది ద రఖాస్తు గడువు 12 రోజులు ఇవ్వగా, ఈసారి రెట్టింపు వ్యవధిగా 24 రోజులు ఇచ్చారు.
జిల్లాలో మొత్తం 49 వైన్ షాపులు ఉన్నాయి. ఇందులో 16 వివిధ కేటగిరి వ్యక్తుల కు రిజర్వు చేయగా, 33 ఓపెన్‌లో మిగిలాయి. గురువారం సాయంత్రం రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. జిల్లాలో ఎస్టీ కేటగిరికి 1, ఎస్సీ వర్గానికి 6, బీసీలకు 9 షాపులు కేటాయించామని, మిగితా 33 షాపులు ఓపెన్ కేటగిరిలో ఉంటాయని చెప్పారు. రిజర్వేషన్ కేటగిరిలో అలాట్ అయిన వైన్ షాపుల వివరాలు, గెజిట్‌లో ప్రచురిస్తామని వివరించారు.
వచ్చే నెల 18 వరకు గడువు
23న లక్కీ డ్రా
జిల్లావ్యాప్తంగా
49 వైన్ షాపులు