
పోటెత్తిన మంజీరా
పాపన్నపేట(మెదక్): సింగూరు నుంచి గురువారం భారీ స్థాయిలో నీరు విడుదల చేయడంతో మంజీరా పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి నీరు ఎక్కువగా వస్తుండటంతో సింగూరు ప్రాజెక్టు తొమ్మిది గేట్లు ఎత్తి 77,821 క్యూసెక్కులు దిగువకు వదిలారు. దీంతో మంజీరా నుంచి వస్తున్న భారీ వరద ఘనపురం మీదుగా ప్రవహిస్తూ ఏడుపాయల దుర్గమ్మ ఆలయాన్ని చుట్టుముట్టి నిజాంసాగర్ వైపు పయనిస్తుంది. ఎల్లాపూర్ బ్రిడ్జి వద్ద భారీగా నీరు ప్రవహిస్తుంది. మంజీరా నది వైపు ఎవరు వెళ్లొద్దని పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. అత్యవసర పరిస్థితిలో 8712657920 ఫోన్ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.