
మెరుగైన వైద్యం అందించండి
కలెక్టర్ రాహుల్‌రాజ్
టేక్మాల్(మెదక్): ‘స్వస్త్ నారి సశక్తి పరివార్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ సిబ్బందిని ఆదేశించారు. గురువారం మండలంలోని పీహెచ్‌సీ, మో డల్ స్కూల్, హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్‌సీ ద్వారా అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రత్యేక ఆరోగ్య శిబిరంలో పిల్లల వైద్య నిపుణులు, ఇతర స్పెషలిస్టులు అందు బాటులో ఉన్నారా..? అని అడిగి తెలుసుకున్నారు. వైద్య శిబిరాల గురించి ముందుగానే అన్ని గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. మెరుగైన ఆరోగ్య సేవలు అవసరం ఉన్న వారిని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి రెఫర్ చేయాలన్నారు. అనంతరం మోడల్ స్కూల్, కేజీబీవీలను పరిశీలించి పాఠశాల అభివృద్ధి పనులకు సంబంధించి మౌలిక వసతులపై ఆరా తీశారు. మెరుగైన వసతులు కల్పించి విద్యార్థులకు గుణాత్మక విద్య అందించే దిశగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ తులసీరాం, వైద్యురాలు హర్షిత, మో డల్ స్కూల్ ప్రిన్సిపాల్ సాయిలు, ఆర్‌ఐ సాయిశ్రీకాంత్ తదితరులు ఉన్నారు.