
సైబర్ మోసాలపై జాగ్రత్త
మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్
పాపన్నపేట(మెదక్): అత్యాశ అనేక అనర్థాలకు దారి తీస్తుందని మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ అన్నారు. గురువారం మండల పరిధిలోని నార్సింగిలో మెదక్, అల్లాదుర్గం సర్కిల్ పరిధిలోని పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ కోసం కమ్యూనిటీ కనెక్టివిటీ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామంలో సాయుధ పోలీసులు కవాతు నిర్వహించి తనిఖీలు చేపట్టారు. అనుమానిత వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. సెల్‌ఫోన్‌లో వచ్చే అనుమానిత మెసేజ్‌లకు స్పందించవద్దని సూచించారు. ఇతరులతో వ్యక్తిగతమైన సమాచారాన్ని పంచుకోవద్దన్నారు. సైబర్ నేరాలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌ల జోలికిపోవద్దని సూచించారు. యువతీ, యువకు లు మత్తు పదార్థాలకు అలవాటుపడొద్దని హితవు పలికారు. కార్యక్రమంలో ఎస్సైలు, స్నెషల్ పార్టీ పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.