
డ్యాం వద్దకు ఎవరినీ రానీయొద్దు
హవేళిఘణాపూర్(మెదక్): మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ శ్రీనివాసరావు గురువారం సందర్శించారు. రికార్డులు పరిశీలించి పెండింగ్ కేసులపై ఎస్‌ఐ నరేశ్‌ను అడిగి తెలుసుకున్నారు. అ నంతరం మండల పరిధిలోని పోచారం డ్యాం వద్ద వరద ఉధృతిని పరిశీలించి, అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజలు ఎవరూ డ్యాం వద్దకు రాకుండా చూడాలన్నారు. మరోవైపు వాతావరణ శాఖ జిల్లాకు ఎల్లో అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో పోచారం ప్రాజెక్టు వద్ద నీటి ఉధృతిని పరిశీలించా రు. డ్యాం వద్ద ఏర్పాటు చేసిన పోలీసు పికెటింగ్‌లో ఉన్న సిబ్బందికి అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు.