
స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ వెనుకడుగు
మెదక్ ఎంపీ రఘునందన్‌రావు
రామాయంపేట(మెదక్): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయమై కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకడుగు వేస్తుందని ఎంపీ రఘునందన్‌రావు విమర్శించారు. బుధవారం రామాయంపేట పట్టణంలో జీఎస్టీ తగ్గింపు విషయమై వ్యాపారులు, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఎన్నికలు జరిపే ఆలోచన లేదని, ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేసే అవకాశం లేదన్నారు. ఒకవేళ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైతే ముందుగా పంచాయతీ వర్కర్లకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్రం పేద, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని జీఎస్టీ తగ్గించిందన్నారు. దీంతో అన్నివర్గాల ప్రజలకు లాభం చేకూరుతుందని వివరించారు. నిధుల కొరతతో పంచాయతీలు నీరసించి పోయాయని ఆరోపించారు. అంతకుముందు ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా పట్టణంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేశ్‌గౌడ్, మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, మండల శాఖ అధ్యక్షుడు నవీన్‌గౌడ్, పట్టణ శాఖ అధ్యక్షుడు అవినాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డిగ్రీ కళాశాల లేకపోవడం దారుణం
తూప్రాన్: కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న తూప్రాన్‌లో ఒక్క డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయకపోవడం దారుణమని ఎంపీ రఘునందన్‌రావు విమర్శించారు. సేవా పక్వాడ్‌లో భాగంగా తూప్రాన్ ఏరియా ఆస్పత్రిని సందర్శించి మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు, కాంగ్రెస్‌కు మధ్య కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సంబంధాలు అంటగడుతూ అసత్య ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 20 నెలలు అయినా విద్యార్థుల చదువులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింపులేదని ఆరోపించారు. ఉమ్మడి