
రోడ్లు ఛిద్రం.. ప్రయాణం నరకం
టేక్మాల్(మెదక్): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని రోడ్లు భారీగా కోతకు గురయ్యాయి. మరమ్మతులు చేయాల్సిన ఆర్‌అండ్‌బీ అధికారులు పట్టించుకోవడం లేదు. మండలంలోని వెంకటాపూర్, చంద్రుతండా, టేక్మాల్, ఎల్లుపేట, బొడ్మట్‌పల్లి, చల్లపల్లి, బర్దిపూర్, ఎలకుర్తి గ్రామాలకు వెళ్లే తారు రోడ్లతో పాటు, వ్యవసాయ పొలాలకు వెళ్లే మట్టి రోడ్లు భారీగా వరదలకు కోతకు గురయ్యాయి. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
టేక్మాల్ శివారులో కోతకు గురైన కల్వర్టు