
కేసుల ఛేదనపై దృష్టి సారించండి
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
మెదక్ మున్సిపాలిటీ: పోక్సో కేసులను అత్యంత ప్రాధాన్యంతో విచారించి నిందితులకు కఠిన శిక్షలు పడేవిధంగా కృషి చేయాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పోలీస్, ఇతరశాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పా ల్గొని మాట్లాడారు. చిన్న వయసులో వేధింపులు, ప్రేమ వ్యవహారాలు వంటి చర్యలు భవిష్యత్తును శాశ్వతంగా దెబ్బతీస్తాయని హెచ్చరించారు. అవగాహన ద్వారానే నివారణ సాధ్యమన్నారు. భరోసా సెంటర్ 24 గంటల పాటు ఎలాంటి ఆటంకం లేకుండా పని చేయడానికి నిరంతర పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి శుభావళి, అదనపు ఎస్పీ మహేందర్, హై దరాబాద్ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏసీపీ శ్రీధర్, భరోసా బృందం, జిల్లా సంక్షేమ, విద్య, వైద్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.