
త్వరితగతిన ఏటీసీ భవన నిర్మాణ పనులు
కలెక్టర్ రాహుల్‌రాజ్
హవేళిఘణాపూర్(మెదక్): మండల కేంద్రమైన హవేళిఘణాపూర్ శివారులో నిర్మిస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) భవన నిర్మాణ పనులను కలెక్టర్ రాహుల్‌రాజ్ మంగళవారం పరిశీలించారు. భవన నిర్మాణంలో పాటిస్తున్న నాణ్యత ప్రమాణాలు, మిగిలిపోయిన పనులను గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. అత్యాధునిక సాంకేతిక విద్యనందించి ఉపాధి అవకాశాలు పెంచాలనే ఉద్దేశంతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేలా చూడాలన్నారు. కలెక్టర్ వెంట ఐటీఐ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఇంటస్ట్రీయల్ ఇన్‌ఫారస్ట్‌టక్చర్ కార్పొరేషన్ జోనల్ మేనేజర్ అనురాధ, డీఈ రాందాస్, వాణిలత పాల్గొన్నారు.