
గాయత్రీదేవిగా.. వన దుర్గమ్మ
దసరా శరన్నవ రాత్రోత్సవాల్లో భాగంగా ఏడుపాయల వన దుర్గమ్మ మంగళవారం శ్రీ గాయత్రీ దేవి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. గోకుల్ షెడ్డులో కొలువు దీరిన దుర్గమ్మ తల్లిని తెల్లవారు జామున వేద బ్రాహ్మణులు గులాబీ రంగు వస్త్రాలతో అలంకరించారు. అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వనదుర్గా అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. కాగా, మూడో రోజైన బుధవారం అమ్మవారు అన్నపూర్ణా దేవి అలంకారంతో దర్శనమిస్తారు. – పాపన్నపేట(మెదక్)
శ్రీ గాయత్రీ దేవి అలంకారంతో వన దుర్గమ్మ