
హాజరు మెరుగు కోసమే ‘ఎఫ్‌ఆర్‌ఎస్’
డీఐఈఓ మాధవి
రామాయంపేట(మెదక్): ప్రభుత్వ కళాశాలల్లో ముఖ గుర్తింపు వ్యవస్థ ద్వారానే విద్యార్థుల హాజరు ప్రక్రియ కొనసాగుతుందని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి మాధవి అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి రికార్డు లు పరిశీలించారు. ఈసందర్బంగా ఆమె మాట్లా డుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు రెగ్యులర్‌గా కళాశాలలకు హాజరు కావాలని, ఈమేరకు లెక్చరర్లు, ప్రిన్సిపాల్ దృష్టి సారించాలన్నారు. విద్యార్థుల అడ్మిషన్ ప్రక్రియ పూర్తయినందున వారికి స్టడీ అవర్స్ తీసుకోవాలని, సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించాలని ఆదేశించారు. ఆమె వెంట అధ్యాపకులు ఉన్నారు.