
మెరుగైన వైద్య సేవలందించాలి
కలెక్టర్ రాహుల్‌రాజ్
రామాయంపేట(మెదక్): ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు సకాలంలో సరైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం మండలంలోని ప్రగతి ధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్కారు వైద్యంపై ప్రజలకు విశ్వాసం కలిగించాలన్నారు. వైద్యులు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించినప్పుడే ఇది సాధ్యపడుతుందన్నారు. ఆస్పత్రుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని, ప్రభుత్వం వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. అంతకుముందు రికార్డులు పరిశీలించారు. రక్త పరీక్ష, ఎక్స్‌రే గదులను పరిశీలించి రోగులతో మాట్లాడారు. సాధారణ ప్రసవాలు, మలేరి యా, చికెన్ గున్యా, టైఫాయిడ్, డెంగీ కేసులపై ఆరా తీశారు. ఆయన వెంట వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు.