
ఇబ్బందుల్లేకుండా నీరు సరఫరా చేయండి
నారాయణఖేడ్: గ్రామాలు, తండాలకు తాగునీటి ఇబ్బందులు ఏర్పడకుండా తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అధికారులకు సూ చించారు. నాగల్‌గిద్ద మండలం గుడూరు గ్రామంలో మంజీరా నదిపై ఉన్న 4 ఎంఎల్‌డీ నీటిశుద్ధి ప్లాంట్‌ను, పంప్‌హౌస్‌ను ఆదివారం ఎమ్మెల్యే సందర్శించారు. పంప్‌హౌజ్‌లో మోటార్ల పనితీరును పరిశీలించి నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా చూడాలని సూచించారు. నెల రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల మిషన్ భగీరథ పైపులు, పంపు మోటారు చెడిపోయి నీటి సరఫరాకు అంతరాయమేర్పడిందని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వాటికి మరమ్మతులు చేపట్టామని, ఇక ముందు నీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు. సమస్యలు ఉన్న పక్షంలో తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.