
ఇందిరమ్మ ఇళ్ల తనిఖీ
నిజాంపేట(మెదక్): మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్లను జెడ్పీ సీఈఓ ఎల్లయ్య శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇళ్ల పురోగతిని పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిరుపేదలకు వరం లాంటిదన్నారు. సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే అవకాశం ఇవ్వడం గొప్ప విషయమని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీడీఒ రాజిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
మనోహరాబాద్(తూప్రాన్): మహిళలు అన్ని రంగాల్లో రాణించి ఆదర్శంగా నిలవాలని జిల్లా అదనపు డీఆర్డీఓ సరస్వతి అన్నారు. శుక్ర వారం మండల కేంద్రంలో ఇందిరా శక్తి సంబరాల్లో భాగంగా నగదు రహిత లావాదేవీలపై మహిళలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు వ్యాపారం నిర్వహించడానికి ముందుకు వస్తున్నారని, అందులో ఎంతోమంది అభివృద్ధి బాటలో పయనిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో డీపీఎం బీఎల్ వెంకటేశం, ఏపీఎం సత్యనారాయణ, సీసీలు కిషన్, మమత, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.
నర్సాపూర్: విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా ఇంటర్మీడియెట్ అధికారిణి మాధవి సూచించారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన స్వాగతోత్సవం కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాణ్యమైన బోధన అందిస్తున్నట్లు చెప్పారు. ఈసందర్భంగా విద్యార్థులకు పలు రకాల ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శేషాచారి, లెక్చరర్లు సిబ్బంది పాల్గొన్నారు.
నిజాంపేట(మెదక్): మండల పరిధిలోని నస్కల్ రైతు వేదిక వద్ద యూరియా కోసం శుక్రవారం రైతులు బారులు తీరారు. గురువారం రాత్రి నుంచే చెప్పులు లైన్‌లో పెట్టి అక్కడే నిద్రించారు. కాగా గ్రామానికి 480 బస్తాల యూరియా రాగా అందజేశారు. అధికారులు స్పందించి అందుబాటులో యూరియా ఉంచాలని రైతులు వేడుకున్నారు.
కౌడిపల్లి(నర్సాపూర్): జిల్లాలో ఇప్పటివరకు 2,581 ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు చెల్లించినట్లు హౌసింగ్ పీడీ మాణిక్యం చౌహాన్ తెలిపారు. శుక్రవారం మండలంలోని ముట్రాజ్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పాటు ఇటీవల గ్యాస్ సిలిండర్ పేలి ధ్వంసమైన ఆకుల శ్రీనివాస్ ఇంటిని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విడతల వారీగా బిల్లులు చెల్లిస్తున్నామని, ఈ వారం 281 ఇళ్లకు రూ. 2.91 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ సుష్మ, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
పంటకోత ప్రయోగాలపై అవగాహన
మెదక్ కలెక్టరేట్: జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌లో పంట కోత ప్రయోగాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ఇందిర, డీఏఓ దేవ్‌కుమార్ పాల్గొని వ్యవసాయ విస్తరణ అధికారులకు అవగాహన కల్పించారు.

ఇందిరమ్మ ఇళ్ల తనిఖీ

ఇందిరమ్మ ఇళ్ల తనిఖీ

ఇందిరమ్మ ఇళ్ల తనిఖీ