
మెరుగైన వసతులు కల్పిస్తాం
కలెక్టర్ రాహుల్‌రాజ్
చేగుంట(తూప్రాన్): వసతి గృహాల్లో మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తామని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. మండల కేంద్రంలోని ఎస్సీ, బీసీ బాలుర వసతి గృహాలను శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈసందర్భంగా నీరు, హాస్టల్ పైకప్పుల నాణ్యత, మెరుగైన విద్యుత్ సౌకర్యం వంటి అంశాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా హాస్టల్ భవనాల నాణ్యతను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట రెవెన్యూ అధికారులు, హాస్టల్ వార్డెన్‌లు ఉన్నారు.
24 వరకు స్పెషల్ ఇన్సెంటీవ్ రివిజన్
మెదక్ కలెక్టరేట్: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈనెల 24 వరకు స్పెషల్ ఇన్సెంటీవ్ రివిజన్ పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి, అదనపు సీఈఓ లోకేష్ కుమార్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా స్పెషల్ ఇన్సెంటీవ్ రివిజన్ పూర్తి చేస్తామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీఓలు రమాదేవి, మహిపాల్‌రెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు.