
పని చేసే వారి వివరాలు తప్పనిసరి
తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్
మనోహరాబాద్(తూప్రాన్): పరిశ్రమల్లో పని చేసే వారి వివరాలను సేకరించాలని, కార్మికుల భద్రత చూడాల్సిన బాధ్యత పరిశ్రమ ప్రతినిధులపై ఉందని తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్ అన్నారు. శుక్రవారం మండలంలోని కొండాపూర్‌లో పరిశ్రమల ప్రతినిధులు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కొంత మంది అభివృద్ధి పనులకు ఆటంకాలు కలిగిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. శాంతి భద్రతల సమస్యలుంటే పోలీసుల దృష్టికి తేవాలన్నారు. పరిశ్రమల ప్రాంతంలో పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని డీఎస్పీని పరిశ్రమ ప్రతినిధులు కోరారు. కార్యక్రమంలో తూప్రాన్ సీఐ రంగాకృష్ణ, ఎస్‌ఐ సుభాశ్‌గౌడ్, పరిశ్రమల అసోసియేషన్ అధ్యక్షుడు శ్రవణ్, ప్రధాన కార్యదర్శి సుబ్రమణ్యం, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, కార్యదర్శి సాంబశివరావు, ప్రతినిధులు పాల్గొన్నారు.