
బాల్య వివాహాలను అరికడదాం
మెదక్ కలెక్టరేట్: బాల్య వివాహాలతో ఆడపిల్లల భవిష్యత్ అంధకారం అవుతుందని, వాటిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా బాలల సంరక్షణ అధికారి కరుణశీల అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సంక్షేమ శాఖ కార్యాలయంలో బాల్య వివాహాల బారి నుంచి విముక్తులైన పిల్లలు, వారి తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం నిర్వ హించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాల్య వివాహాలతో జరిగే అనర్థాలను వివరించారు. కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు ఉప్పలయ్య, విజన్ సంస్థ డైరెక్టర్ కై లాష్, ప్లాన్ ఇండియా అధికారులు సుజాత, రాహుల్, రాజు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు పాల్గొన్నారు.