
పదేళ్లలో బీఆర్‌ఎస్ చేసిందేమిటి?
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు
చిన్నశంకరంపేట(మెదక్): బీఆర్‌ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి ప్రజలకు చేసింది ఏమి లేదని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు విమర్శించారు. మండలంలోని కామారం తండాలో మంగళవారం పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ప్రజల సమస్యలు విస్మరించి, దోచుకున్నది పంచుకునే పంచాయతీతో గడుపుతున్నారని మండిపడ్డారు. గ్రామాలను పట్టించుకోలేదని, పేదలకు కనీసం ఇళ్లు కూడ ఇవ్వలేదన్నారు. కేసీఆర్ నుంచి మొదలుకొని ఎమ్మెల్యేల వరకు దోచుకున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందన్నారు. సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు అందిస్తుందన్నారు. తండాలో నెలకొన్న తాగునీటి సమస్యను తీరుస్తామన్నారు. సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్, పంచాయతీ భవనం కోసం నిధులు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మా జీ ఎంపీపీ పండరిగౌడ్, శ్రీమన్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సాన సత్యనారాయణ, నాయకులు రాజిరెడ్డి, మోహన్‌నాయక్, తౌరియా, మంగ్యనాయక్ పాల్గొన్నారు.