
జోరు వాన.. జనం హైరానా
● రేగోడ్‌లో అత్యధికంగా12.5 సె.మీ నమోదు
● పలుచోట్ల నిలిచిన రాకపోకలు
● కూలిన ఇళ్లు.. దెబ్బతిన్న పంటలు
రేగోడ్(మెదక్)/టేక్మాల్/కొల్చారం(నర్సాపూర్)/నర్సాపూర్: జిల్లాలోని పలు మండలాల్లో సోమవా రం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. రేగోడ్‌లో అత్యధికంగా 12.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలువురి ఇళ్లలోకి వరద చేరి నానా తంటాలు పడ్డా రు. ప్యారారం గ్రామస్తులు ఖేడ్ మార్కెట్ వెళ్లి, తిరిగి ఇంటికి చేరుకొనే సమయంలో పోచారం– ప్యారారం రోడ్డుపై వరద ఉధృతంగా ప్రవహించింది. దీంతో జేసీబీ సహాయంతో వారిని వాగు దాటించారు. తిమ్మాపూర్‌లో ట్రాక్టర్ సాయంతో ప్రజలను సురక్షితంగా వాగు దాటించారు. కొల్చారం మండలంలో 102. 8 మి.మీ వర్షం కురిసింది. వరి, పత్తి చేలకు నష్టం వాటిల్లింది. శిథిలావస్థలో ఉన్న ఇళ్లు కూలిపోయాయి. టేక్మాల్ మండలంలో వర్షం దంచికొట్టడంతో మల్కాపూర్ నుంచి కుసంగి, దనూర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మండలం మీదుగా గుండువా గు ఉధృతంగా ప్రవహించడంతో టేక్మాల్– జోగిపేట, ఎలకుర్తి– దనూరకు రాకపోకలు నిలిచిపోయాయి. వరి పొలాలు నీటమునిగా యి. నర్సాపూర్‌లో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. సంత జరిగే సమయంలోనే వర్షం కురువడంతో వ్యాపారం సాగలేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు.

జోరు వాన.. జనం హైరానా

జోరు వాన.. జనం హైరానా

జోరు వాన.. జనం హైరానా