
మౌలిక వసతుల కల్పనకు కృషి
నర్సాపూర్ రూరల్/కౌడిపల్లి: అసంపూర్తి భవనాన్ని పూర్తి చేయించి విద్యార్థులకు మెరుగైన విద్యాబోధనలా చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ పురుషోత్తం తెలిపారు. మంగళవారం నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించి ల్యాబ్, తరగతి గదులు, పరిసరాలను స్వయంగా పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిగ్రీ కళాశాల భవనం అసంపూర్తిగా ఉండడంతో తరగతుల నిర్వహణకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నట్లు గుర్తించామన్నారు. త్వరలో భవనాన్ని పూర్తి చేయించి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రిన్సిపాల్ హుస్సేన్ కళాశా ల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో అధ్యాపకులు అదెప్ప, రమేశ్, ఖాజా ఆరీఫ్, రవికుమార్, హేమంత్, మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం కౌడిపల్లి మండలంలోని రాయిలాపూర్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ శిబిరానికి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు ఇష్టంతో చదివితే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.
ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ పురుషోత్తం