టీచర్లకు టెట్‌ మినహాయింపు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

టీచర్లకు టెట్‌ మినహాయింపు ఇవ్వాలి

Sep 16 2025 8:22 AM | Updated on Sep 16 2025 8:22 AM

టీచర్

టీచర్లకు టెట్‌ మినహాయింపు ఇవ్వాలి

టీచర్లకు టెట్‌ మినహాయింపు ఇవ్వాలి కొనసాగుతున్న వరద 22 నుంచి ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు హామీ నిలబెట్టుకోవాలి సాంకేతిక విప్లవానికి నాంది

మెదక్‌ కలెక్టరేట్‌: టెట్‌లో ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని తపస్‌ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్‌ నగేశ్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి ఉపశమనం కలిగేలా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తపస్‌ జిల్లా నాయకులు సుమతి, రేఖ, రాజేశ్వర్‌, నర్సింలు, శ్రీధర్‌రెడ్డి, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.

సింగూరు నీరు విడుదల

పుల్‌కల్‌(అందోల్‌): సింగూరు ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో మూడు గేట్‌లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టుకు ఎగువన భారీ వర్షాలు కురవడంతో భారీ వరదలు వస్తోంది. దీంతో 8,9,10 నంబర్‌ గేట్‌లను మీటరున్నర పైకి ఎత్తి 23,230 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా రెండు టర్బయిన్‌లను రన్‌చేసి 2,500 క్యూసెక్కుల నీటిని వినియోగించి విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజె క్టులో 17,500 టీఎంసీల నీటిని ఉంచి మిగతా నీటిని దిగువకు వదులుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

పాపన్నపేట(మెదక్‌): ఏడుపాయల్లో మంజీరా వరద కొనసాగుతోంది. సోమవారం సింగూరు నుంచి నీరు దిగువకు వదిలారు. దీంతో ఘనపురం ఆనకట్ట పొంగి పొర్లి దుర్గమ్మ ఆలయాన్ని చుట్టముట్టింది. భక్తులు రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు చేస్తున్నారు. వరదల వైపు వెళ్లకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

మెదక్‌ కలెక్టరేట్‌: ఈనెల 22 నుంచి 28వ తేదీ వరకు జరిగే ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసినట్లు కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో డీఈఓ రాధాకిషన్‌ ఆధ్వర్యంలో పరీక్షల నిర్వహణపై సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని బాలికల హై స్కూల్‌లో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ నగేశ్‌, డీఎంహెచ్‌ఓ శ్రీరామ్‌, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

వెల్దుర్తి(తూప్రాన్‌): ఎన్నికలకు ముందు ఆసరా, వికలాంగుల పింఛన్‌ పెంపుపై హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక పూర్తిగా విస్మరించిందని ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు యాదగిరి ఆరోపించారు. ఈ మేరకు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌ బాలలక్ష్మికి అందజేశారు.

మెదక్‌ కలెక్టరేట్‌: క్వాంటం యుగం సరికొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతుందని డీఈఓ రాధాకిషన్‌ అన్నారు. ఈనెల 12న మెదక్‌లో క్వాంటం యుగం ప్రారంభం అవకాశాలు– సవాళ్లు అనే అంశంపై పోటీలు నిర్వహించారు. సోమవారం డీఈఓ కార్యాలయంలో విజేతలకు డీఈఓ ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెదక్‌ జిల్లా కేంద్రంలోని సిద్ధార్థ మోడల్‌ హై స్కూల్‌ విద్యార్థి ధనుష్‌ ప్రథమస్థానంలో నిలవగా, మంభోజిపల్లి గీతా హై స్కూల్‌ విద్యార్థిని యశస్విని ద్వితీయస్థానం, హవేళిఘణాపూర్‌ మండలం కూచన్‌పల్లి జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థిని అభినయ తృతీయస్థానంలో నిలిచారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్‌ అధికారి రాజిరెడ్డి, గైడ్‌ టీచర్లు పాల్గొన్నారు.

టీచర్లకు టెట్‌  మినహాయింపు ఇవ్వాలి  
1
1/2

టీచర్లకు టెట్‌ మినహాయింపు ఇవ్వాలి

టీచర్లకు టెట్‌  మినహాయింపు ఇవ్వాలి  
2
2/2

టీచర్లకు టెట్‌ మినహాయింపు ఇవ్వాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement