
సత్వర పరిష్కారం చూపండి
● కలెక్టరేట్ రాహుల్‌రాజ్
● ప్రజావాణికి 96 వినతులు
మెదక్ కలెక్టరేట్: ప్రజావాణిలో వచ్చే దరఖాస్తుల సత్వర పరిష్కారానికి చొరవ చూపాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 96 వినతులు రాగా స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి దరఖాస్తు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. పరిష్కారంలో జాప్యం చేయొద్దని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, డీఆర్‌ఓ భుజంగరావు, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, అన్నిశాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
17న మెగా హెల్త్‌క్యాంపు
జిల్లాలో స్వస్త్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు హెల్త్ క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణ సేవలను అందించనున్నట్లు చెప్పారు.
త్వరగా మరమ్మతులు చేపట్టాలి
హవేళిఘణాపూర్(మెదక్): మండల పరిధిలోని మక్తభూపతిపూర్ వెళ్లే రోడ్డు వర్షాలతో దెబ్బతిందని, బ్రిడ్జి వద్ద వెంటనే మరమ్మతులు చేసి రవాణా సదుపాయం పునరుద్ధరించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. సోమవారం బ్రిడ్జి పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట పీఆర్ ఈఈ నర్సింలు, డీఈ మహేశ్, ఏఈ నితిన్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ నాగరాజు ఉన్నారు.