
సమస్యలు పరిష్కరించండి
మెదక్ కలెక్టరేట్: ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అజ్జమర్రి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఉద్యోగులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ రాహుల్‌రాజ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీఓ 64ను నిలిపివేసి, పాత పద్ధతిలోనే వేతనాలు చెల్లించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న వేతనాలను సైతం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మెదక్ జిల్లాలో మాత్రమే అధికారులు ఉద్యోగుల వేతనాలు తొలగించడం దారుణం అన్నారు. ఇప్పటికై నా ఉద్యో గుల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో నిరవధిక సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.