
దంచికొట్టిన వాన
మెదక్ మున్సిపాలిటీ: పట్టణంలో సోమవారం రాత్రి వర్షం దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పట్టణంలోని రాందాస్ చౌరస్తా నుంచి మున్సిపల్ కార్యాలయం, పాత బస్టాండ్ వరకు, బస్‌డిపో వెళ్లే రోడ్డు, చమన్ చౌరస్తా నుంచి ముత్తాయికోట వెళ్లే రోడ్డు, ఫత్తేనగర్ ప్రధాన దారి వర్షం నీరుతో చెరువులను తలపించాయి. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బంది పడ్డారు.
ప్రజల హైరానా..
తూప్రాన్: తూప్రాన్‌లో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఈసందర్భంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మండలంలో 91.3 మీల్లిమీటర్ల వర్షపాతం నమోదు కాగా, పట్టణంలోని గా యత్రీనగర్ మళ్లీ జలమయం అయింది. ఏబీ కాలనీ, కిష్టాపూర్‌కు వెళ్లే రహదారిపై హల్దీవాగు పొంగిపొర్లి రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని వెంకటరత్నాపూర్‌లో ఇళ్లలోకి నీరు చేరింది. రెండు గంటలకుపైగా కురిసిన వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా మున్సిపల్ కమిషనర్ గణేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది రాత్రి చర్యలు చేపట్టారు.
జలమయమైన మెదక్ ప్రధాన రహదారి

దంచికొట్టిన వాన