
దారి కల్పిస్తేనే భూములిస్తాం
చిన్నశంకరంపేట(మెదక్): మిర్జాపల్లికి దారి కల్పించేందుకు నూతన అండర్‌పాస్ రైల్వే బ్రిడ్జిని నిర్మి స్తేనే తాము డబుల్‌లైన్ కోసం భూములిస్తామని గ్రామస్తులు రైల్వే ఇంజనీర్ విష్ణుదేవ్‌కు తేల్చిచెప్పారు. సోమవారం మండలంలోని మిర్జాపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వే డబుల్‌లైన్ కోసం అవసరమైన భూములను పరిశీలించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు రైల్వే అధికారులకు తమ సమస్యను వివరించారు. ఇప్పుడున్న అండర్‌పాస్ బ్రిడ్జిలోకి చెరువు బ్యాక్ వాటర్ వచ్చి రాకపోకలకు ఇబ్బంది పడుతున్నామని, డబుల్‌లైన్ తర్వాత ఈ సమస్య మరింత జటిలం అవుతుందని వివరించారు. ఇదే విషయమై సోమవారం ప్రజావాణిలో గ్రామస్తులు కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు.