
సమస్యలుంటే నేరుగా సంప్రదించాలి
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
మెదక్ మున్సిపాలిటీ: ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణికి మొత్తం 19 అర్జీలు వచ్చాయి. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు ఎలాంటి పైరవీలు, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా పోలీస్ అధికారులను సంప్రదించాలని తెలిపారు. చట్టబద్ధ పరిష్కారం ద్వారానే ప్రజలకు న్యా యం జరిగే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత దగ్గరగా కావడం పో లీస్‌శాఖ ప్రధాన లక్ష్యమని వివరించారు. నేరుగా ఫిర్యాదులను స్వీకరించి, పరిష్కరిస్తున్నామని ఎస్పీ తెలిపారు.