
బాధ్యతగా పనిచేస్తా
గతంలో కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం శెట్పల్లిలో వీఆర్‌ఏగా పనిచేశాను. 2023లో సికింద్రాబాద్ మండలానికి బదిలీ చేశారు. ఇటీవల పాపన్నపేట మండలం మల్లంపేట జీపీఓగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. భూభారతి చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడానికి కృషి చేస్తా.
– రాజశేఖర్, జీపీఓ, మల్లంపేట
దూరభారంతో ఇబ్బంది పడ్డా
మా స్వగ్రామం కౌడిపల్లి మండలం వెల్మకన్నె. అప్పట్లో కౌడిపల్లిలో వీఆర్‌ఏగా పని చేశాను. అనంతరం జనగాం జిల్లా కలెక్టరేట్‌లో రికార్డు విభాగానికి బదిలీ చేశారు. సుమారు 150 కి.మీ దూరంలో విధులు నిర్వర్తించడం ఇబ్బందిగా ఉండేది. ప్రస్తుతం పాపన్నపేట జీపీఓగా నియామకమయ్యాను.
– కృష్ణ, జీపీఓ, పాపన్నపేట

బాధ్యతగా పనిచేస్తా