వన దుర్గమ్మకు పూజలు | - | Sakshi
Sakshi News home page

వన దుర్గమ్మకు పూజలు

Sep 15 2025 9:18 AM | Updated on Sep 15 2025 9:18 AM

వన దు

వన దుర్గమ్మకు పూజలు

పాపన్నపేట(మెదక్‌): ఏడుపాయల వన దుర్గమ్మను ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శి ంచుకున్నారు. రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది చర్యలు చేపట్టారు.

పార్టీ బలోపేతమే లక్ష్యం

పాపన్నపేట(మెదక్‌): బీజేపీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కరణం పరిణిత అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికై న అనంతరం ఆదివారం మొదటిసారి ఏడుపాయల దుర్గమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆమె తన స్వగ్రామమైన కొత్తపల్లి రాగా, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు స్వాగతం పలికి సన్మానించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కై వసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్‌ నాయకులు సోమశేఖర్‌రావు, బైండ్ల సత్యనారాయణ, రాములు, సాయినాధ్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

2,446 కేసుల రాజీ: ఎస్పీ

మెదక్‌ మున్సిపాలిటీ: జాతీయ మెగా లోక్‌ అదాలత్‌లో భాగంగా జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో 2,446 కేసులు రాజీ చేసినట్లు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో ఐపీసీ కేసులు 482, సైబర్‌ క్రైం 106, ఈ–పెట్టి కేసులు 193, డీడీఎంవీ యాక్ట్‌ 1,665 కేసులను రాజీపర్చినట్లు తెలిపారు. సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోయిన 106 మంది బాధితులకు రూ. 24,19,680 మొత్తాన్ని తిరిగి వారి ఖాతాల్లో జమ చేసేలా చర్యలు చేపట్టామన్నారు. చిన్న చిన్న గొడవలు, వివాదాలు కోర్టుల్లో సంవత్సరాల తరబడి నిలవకుండా, ఇరువర్గాలు రాజీ మార్గం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడం సమాజానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. ఈసందర్భంగా పోలీస్‌ అధికారులు, సైబర్‌ క్రైం యూనిట్‌, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

సమస్యలు పరిష్కరించండి

వెల్దుర్తి(తూప్రాన్‌): మాసాయిపేట మండలంలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆదివారం నాయకులు ఎంపీ రఘునందన్‌రావును కలిసి వినతిపత్రం అందజేశారు. అండర్‌ గ్రౌండ్‌ బ్రిడ్జి వద్ద నీరు నిల్వ ఉండడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఎంపీకి విన్నవించగా, రైల్వే జీఎంతో ఫోన్‌లో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే చెట్ల తిమ్మాయిపల్లి జాతీయ రహదారి వద్ద జంక్షన్‌ నిర్మాణం, సర్వీస్‌ రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరగా, సానుకూలంగా స్పందించారు. ఎంపీని కలిసిన వారిలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు నాగేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్‌, ప్రధాన కార్యదర్శి నవీన్‌యాదవ్‌, శ్రీకాంత్‌గౌడ్‌, సీనియర్‌ నాయకులు గుండ్ల రాజు ఉన్నారు.

బీజేపీ నాయకుడికి

షోకాజ్‌ నోటీసు

గజ్వేల్‌: పట్టణానికి చెందిన బీజేపీ క్రీయాశీలక నాయకుడు కాశమైన నవీన్‌కు షోకాజ్‌ నోటీసులు ఇచ్చినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి నరసింహ ముదిరాజ్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 12న పట్టణంలోని అయ్యప్ప ఫంక్షన్‌ హాలు వద్ద పార్టీ నేతలు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను చించివేసి, అసభ్యపదజాలంతో దుర్భాషలాడినందువల్ల ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు.

వన దుర్గమ్మకు పూజలు 
1
1/3

వన దుర్గమ్మకు పూజలు

వన దుర్గమ్మకు పూజలు 
2
2/3

వన దుర్గమ్మకు పూజలు

వన దుర్గమ్మకు పూజలు 
3
3/3

వన దుర్గమ్మకు పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement