
సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తున్న బీజేపీ
మెదక్ కలెక్టరేట్: తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించి, ప్రజల మధ్య చీలికలు తేస్తున్న బీజేపీ విధానాలను తిప్పికొడతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్క రాములు అన్నారు. ఆదివారం మెదక్‌లోని కేవల్ కిషన్ భవన్‌లో తెలంగాణ రైతంగా సాయుధ పోరాట వాస్తవాలు– వక్రీకరణాలు అనే అంశంపై సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాయుధ పోరాటంలో ఏనాడు పాల్గొనని బీజేపీ చరిత్రను వక్రీకరించేందు ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను మార్చేందుకు కుట్రలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు బాలమణి, రాష్ట్ర కమిటీ సభ్యుడు అడివయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు
చుక్క రాములు