
పరిసరాల పరిశుభ్రత తప్పనిసరి
కౌడిపల్లి(నర్సాపూర్): పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ సురేశ్‌కుమార్ అన్నారు. ఆదివారం మండలంలోని రాయిలాపూర్ ఉన్నత పాఠశాలలో నర్సాపూర్ డిగ్రీ కళాశాల యూనిట్–1 ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. ఆవరణలో పిచ్చిమొక్కలు, చెత్తను తొలగించారు. అనంతరం యోగా మాస్టర్ అంజయ్య ఆధ్వర్యంలో వలంటీర్లు యోగా చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిరోజు ఇల్లు, పాఠశాలను శు భ్రంగా ఉంచుకోవాలన్నారు. యోగాతో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో వలంటీర్లు స్నేహ, కళ్యాణ్, అంజలి, దుర్గాప్రసాద్, మౌనిక, ప్రభాకర్ పాల్గొన్నారు.