
వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
కౌడిపల్లి(నర్సాపూర్): వర్షాల నేపథ్యంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆదేశించారు. శనివారం మండల కేంద్రంలోని సీహెచ్‌సీ, పీహెచ్‌ీసీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా సిబ్బంది హాజరు, ఓపీ రిజిస్టర్, మందుల స్టాక్‌ను పరిశీలించి రోగులతో మాట్లాడారు. వైద్య సిబ్బంది పనితీరు, రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రజలు వ్యక్తిగత, పరసరాల పరిశుభ్రతను పాటించాలన్నారు. జిల్లాకు భారీ వర్ష సూచన హెచ్చరిక నేపథ్యంలో మంజీరా పరివాహాక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతం, లోలెవల్ బ్రిడ్జిల వద్దకు వెళ్లవద్దని సూచించారు. పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు ఇంటి నుంచి బయటకు రావొద్దని చెప్పారు. అనంతరం నిర్మాణంలో ఉన్న సీహెచ్‌సీ నూతన భవనాన్ని పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్