
విద్యా ప్రమాణాలు పెంపొందించాలి
టేక్మాల్(మెదక్)/పాపన్నపేట: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించాలని డీఈఓ రాధాకిషన్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కాంప్లెక్స్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలని సూచించారు. వారికి అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధించాలన్నారు. అనంతరం పాపన్నపేట మండల పరిధిలోని నామాపూర్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించేలా బోధించాలని సూచించారు. ఉపాధ్యాయులు ఖచ్చితంగా సమయపాలన పాటించాలన్నారు. ఆయన వెంట ఎంఈఓ ప్రతాప్‌రెడ్డి, ఉపాధ్యాయులు, ఏఎస్‌ఓ నవీన్, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్, అమరేందర్‌రెడ్డి, అజీజ్, మండల రిసోర్స్ పర్సన్ కృష్ణ తదితరులు ఉన్నారు.
డీఈఓ రాధాకిషన్