
సేవాభావాన్ని అలవర్చుకోవాలి
కౌడిపల్లి(నర్సాపూర్): విద్యార్థులు విద్యార్థి దశ నుంచే సేవా భావాన్ని అలవాటు చేసుకోవాలని ఓయూ ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగాం కోఆర్డినేటర్ ఆచార్య విద్యాసాగర్ తెలిపారు. శుక్రవారం మండలంలోని రాయిలాపూర్‌లో నర్సాపూర్ డిగ్రీ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ హుస్సేన్ ఆధ్వర్యంలో యూనిట్–1 ఎన్‌ఎస్‌ఎస్ శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికసిత్ భారత్‌లో విద్యార్థులు, యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విద్యతో పాటు సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని చెప్పారు. ప్రిన్సిపాల్ హుస్సేన్ మాట్లాడుతూ స్వామి వివేకానంద, జ్యోతిబాపూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. గ్రామస్తులకు మూఢనమ్మకాలు, బాల్యవివాహాలు, వరకట్న దురాచారం గురించి అవగాహన కల్పించాలని చెప్పారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ సురేష్‌కుమార్, ఉన్నత పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం సరిత, రాజ్‌కుమార్, వాలంటీర్ కవిత తదితరులు పాల్గొన్నారు.
ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ విద్యాసాగర్
రాయిలాపూర్‌లో శిబిరం ఏర్పాటు