
ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు
అల్లాదుర్గం(మెదక్): విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు మంటలు చెలరేగి తృటిలో ప్రమాదం తప్పింది. ఈ సంఘటన అల్లాదుర్గం మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ పిచ్చి మొక్కలు వెలిశాయి. ట్రాన్స్‌ఫార్మర్ పైకి తీగలు అల్లుకున్నాయి. వీటిని తొలగించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఆగస్టు 8న సాక్షి దినపత్రికలో శ్రీపొదల్లో ట్రాన్స్‌ఫార్మర్‌శ్రీఅనే శీర్షికన కథనం ప్రచురితమైంది. అయినా విద్యుత్ అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరించారు. స్థానికంగా అధికారులు ఎవరూ ఉండటం లేదని, ప్రతీసారి ప్రమాదాలు చోటు చేసుకుంటే గంటల తరబడి వారి కోసం వేచి చూడాల్సిన దుస్థితి నెలకొందని స్థానికులు మండిపడుతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ పొదలు వెలిసి ప్రమాదకరంగా మారితే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పొదలతో ట్రాన్స్‌ఫార్మర్ కనిపించలేని పరిస్థితి నెలకొనడంతో మూగజీవాలు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన ఘటనలు ఎన్నో ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
● తప్పిన ప్రమాదం
● అధికారుల నిర్లక్ష్యమే కారణం