
విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలి
చేగుంట(తూప్రాన్): విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నతంగా ఎదగాలని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోకవర్గ ఇన్‌చార్జి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. చేగుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇటీవల చేరిన విద్యార్థులకు స్వాగత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. కొత్త విద్యార్థులు సీనియర్ విద్యార్థులు కలిసిమెలిసి చదువుకోవాలని పేర్కొన్నారు. కళాశాలకు అదనపు గదులు, ప్రహరీ, నిర్మించడంతో కళాశాల సమస్యలు తీర్చేందుకు కృషి చేయాలని శ్రీనివాస్‌రెడ్డిని ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి కోరారు. ఇన్‌చార్జి మంత్రితో మాట్లాడి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.
కాంగ్రెస్ నేత శ్రీనివాస్‌రెడ్డి ఉద్బోధ