
ప్రభుత్వ అసమర్థతతోనే కష్టాలు
ఎమ్మెల్యే సునీతారెడ్డి
కౌడిపల్లి(నర్సాపూర్): కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతతోనే రైతులు కష్టాలు పడుతున్నారని ఎమ్మెల్యే సునీతారెడ్డి విమర్శించారు. గురువారం మండల కేంద్రంలో లోఓల్టేజీ విద్యుత్, యూరియా కొరతపై జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కౌడిపల్లి సబ్‌స్టేషన్‌లోని 50 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను వేరే చోటుకు తరలించి, ఇక్కడ కేవలం 16 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌ను పెట్టడంతో కౌడిపల్లి, కొల్చారం, చిలప్‌చెడ్ మండలాల్లో లోఓల్టేజీ సమస్య తలెత్తిందన్నారు. యూరియా కోసం రోజుల తరబడి రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతుబోనస్ ఇవ్వలేదని, మిషన్ భగీరథ నీరు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. అనంతరం విద్యుత్ సమస్యను పరిష్కరించాలని విద్యుత్‌శాఖ ఏడీకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సార రామాగౌడ్, నాయకులు మహిపాల్‌రెడ్డి, సంతోష్‌రావు, నవీన్‌గుప్త, దుర్గారెడ్డి, నవీన్, సాయాగౌడ్, గౌరీశంకర్, అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.