
అక్రమాలకు పాల్పడితే చర్యలు
చిలప్‌చెడ్(నర్సాపూర్): ఉపాధి పనులు చేయకుండానే కూలీలకు వేతన చెల్లింపులు జరిగా యని డీఅర్‌డీఓ శ్రీనివాస్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో 2024– 25 సంవత్సరానికి సంబంధించి రూ. 3.78 కోట్ల ఉపాధి పనులు, నిధుల విషయమై సామాజిక తనిఖీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకరికి బదులు, మరొకరు కూలీకి వస్తే డబ్బులు చెల్లించవద్దని సిబ్బందిని ఆదేశించారు. గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించే పథకమని, దీనిలో కూడా అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సీనియర్ క్వాలిటీ కంట్రోలర్ అధికారి జ్యోతి, హెచ్‌ఆర్ మేనేజర్ రాజేందర్‌రెడ్డి, విజిలెన్స్ అధికారి శ్రీహరి, స్టేట్ టీం మేనేజర్ అంజాగ ౌడ్, ఎస్‌అర్‌పీ నర్సయ్య, ఏపీఓ శ్యాంకుమార్, ఎంపీడీఓ ప్రశాంత్, ఈసీ భగవాన్‌రెడ్డి, పీఆర్‌ఏఈ మారుతి, పంచాయతీ కార్యదర్శులు, డీఅర్‌పీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.