
వీరనారి చాకలి ఐలమ్మ
మెదక్ కలెక్టరేట్: అన్యాయం, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ జీవితం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో ఐలమ్మ వర్ధంతిని జిల్లా బీసీ అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా, ఆమె చిత్రపటానికి కలెక్టర్ నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాయుధ పోరాటంలో ఐలమ్మ చూపిన ధైర్య సాహసాలు ఎనలేనివని కొనియాడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు సంగుస్వామి, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు మెట్టు గంగారాం పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయిలో రాణించాలి
మెదక్ కలెక్టరేట్: విద్యార్థుల్లో దాగి ఉన్న కళా నైపుణ్యాలను వెలికితీయాలనే ఉద్దేశంతోనే కళా ఉత్సవ్ పోటీలు నిర్వహిస్తున్నామని డీఈ ఓ రాధాకిషన్ తెలిపారు. బుధవారం పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో పోటీలను ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో ఉత్తమ ప్రదర్శన చేసి రాష్ట్రస్థాయిలో రాణించాలని విద్యార్థులకు సూచించారు. రెండు రోజుల పాటు పో టీలు జరుగుతాయని, మొదటి రోజు పాటలు, వాయిద్యాల పోటీలు, సంప్రదాయ కథల పోటీలు, రెండో రోజు సంప్రదాయ, జానపద నృత్యం, డ్రామా పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ శంకర్, కళాఉత్సవ్ కమిటీ కన్వీ నర్ రామేశ్వర్‌ప్రసాద్, ప్రధానోపాధ్యాయులు రేఖ తదితరులు పాల్గొన్నారు.
మలేరియా పరీక్షలు తప్పనిసరి
చిన్నశంకరంపేట(మెదక్): జ్వరంతో అస్పత్రికి వచ్చే ప్రతి ఒక్కరికి మలేరియా రక్త పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ శ్రీరామ్ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం నార్సింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందుల వివరాలు, ఓపీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా వైద్యులతో సమావేశం నిర్వహించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లో ఫీవర్ సర్వే నిరంతరం కొనసాగించాలన్నారు. జ్వరంతో వచ్చేవారికి ధైర్యం కల్పించడంతో పాటు అవసరమైన మందులు అందించాలన్నారు. ఆయన వెంట వైద్యులు. సిబ్బంది ఉన్నారు.
దరఖాస్తులు పరిష్కరించాలి
నిజాంపేట(మెదక్): భూ భారతి సమస్యలను వెంటనే పరిష్కరించాలని మెదక్ ఆర్డీఓ రమా దేవి అధికారులను ఆదేశించారు. బుధవారం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈసందర్భంగా మండలంలో యూరి యా కొరత గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే భూ భారతి సదస్సులో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. మండలంలో గత 100 ఏళ్ల నాటి ఓటర్ లిస్ట్‌ను సరిచేయాలన్నారు. సమావేశంలో తహసీల్దార్ శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ రమ్యశ్రీ, ఆర్‌ఐ ఇమ్మాద్ పాల్గొన్నారు.
‘నిబంధనలు పాటించాలి’
మెదక్ కలెక్టరేట్: జాతీయ జెండాను ఎగురవేసే, సంరక్షించే విషయంలో కొన్ని నియమ, నిబంధనలు పాటించాలని జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ ఆర్‌ఎం శుభవల్లి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉల్లంఘనకు పాల్పడితే చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారని హెచ్చరించారు. వేడుకల అనంతరం జాతీయ జెండాలను కొంత మంది ఇష్టానుసారం పడేస్తున్నారని, ఇది చట్టరీత్యా నేరం అన్నారు. గణ తంత్ర వేడుకలకు ముందు కాగితపు జెండాల వినియోగానికి సంబంధించి కేంద్ర హోంశాఖ కొన్ని సూచనలు చేసిందన్నారు.

వీరనారి చాకలి ఐలమ్మ