పీహెచ్‌సీకి స్థల ధ్రువీకరణ పత్రం అందజేత | - | Sakshi
Sakshi News home page

పీహెచ్‌సీకి స్థల ధ్రువీకరణ పత్రం అందజేత

Sep 10 2025 6:30 AM | Updated on Sep 10 2025 7:37 AM

నిజాంపేట(మెదక్‌): నిజాంపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించబోయే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు వైద్య అధికారులు, రెవెన్యూ సిబ్బంది స్థల పరిశీలన చేశారు. ఈ మేరకు మంగళవారం నిజాంపేట గ్రామ శివారులోని 629 సర్వే నంబర్‌లోని ఒక ఎకరం 20 గుంటల భూమిని మండల సర్వేయర్‌ ప్రశాంత్‌ సరిహద్దులు చేసి మండల వైద్య ఆరోగ్య శాఖ అదికారిని డాక్టర్‌ హరిప్రియకు అప్పగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిజాంపేట మండలానికి వైద్య ఆసుపత్రి నిర్మించిన్నట్లయితే పేదల ప్రజలకు ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ సాయికృష్ణ, ఎఎన్‌ఎమ్‌ బాలమణి తదితరులు పాల్గొన్నారు.

కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడతాం

సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్‌

నర్సాపూర్‌: కేంఽద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లేబర్‌ కోడ్‌కు వ్యతిరేకంగా సీఐటీయూ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడుతామని యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్‌ అన్నారు. మంగళవారం ‘కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు– ప్రభుత్వాల విధానాలు’అనే అంశంపై సెమినార్‌లో పాల్గొని మాట్లాడారు. కార్మిక వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నామని చెప్పారు. సీఐటీయూ రాష్ట్ర ఐదవ మహాసభలు డిసెంబరు 7నుంచి 9వరకు మెదక్‌ జిల్లా కేంధ్రంలో నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పరిశ్రమల్లో కాంట్రాక్టు కార్మికులకు భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సెమినార్‌లో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు, నాయకులు చంద్రయ్య, నర్సింలు, పెంటయ్య, రుబ్లీ, పుష్ప, అనిత తదితరులు పాల్గొన్నారు.

ప్రతి గ్రామానికి

నాణ్యమైన విత్తనాలు

రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నిర్మల

పెద్దశంకరంపేట(మెదక్‌): ప్రతీ గ్రామానికి క్యూఎస్‌ఈవీ ద్వారా నాణ్యమైన విత్తనాలు అందిస్తామని జోగిపేట తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ నిర్మల అన్నారు. మంగళవారం మండల పరిధిలోని బూర్గుపల్లి, ముసాపేట తదితర గ్రామాలలో క్యూఎస్‌ఈవీ (క్వాలిటీ సీడ్స్‌ ఎవ్రీ విలేజ్‌) పర్యటించి వరి పంటను పరిశీలించారు. ఈ పంట ద్వారా వచ్చిన వరి ధాన్యాన్ని ఆయా గ్రామాలలో రైతులకు విత్తనాల రూపంలో అందిస్తామని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమలలో ఏఓ కృష్ణ, ఏఈఓలు అఖిల్‌, వినీత్‌, రైతులు నర్సింహాగౌడ్‌, అంజిరెడ్డి తదితరులున్నారు.

పాన్‌బ్రోకర్లపై చర్యలు

జిల్లా ఎస్‌పీ శ్రీనివాసరావు

రామాయంపేట(మెదక్‌): నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న పాన్‌బ్రోకర్లపై చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆయన మంగళవారంరాత్రి రామాయంపేట పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా అక్రమంగా కొనసాగుతున్న పాన్‌ బ్రోకర్ల వివరాలు సేకరిస్తున్నామన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలని, సైబర్‌ నేరాల నియంత్రణకు విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆయన ఆదేశించారు. రాత్రి బీట్ల సంఖ్యను పెంచి చోరీలను నివారించాలని ఆదేశించారు. స్థానిక సీఐ వెంకట్‌రాజాగౌడ్‌, ఎస్‌బీ సీఐ సందీప్‌రెడ్డి , ఎస్‌ఐ బాల్‌రాజ్‌ ఆయన వెంట ఉన్నారు.

పీహెచ్‌సీకి స్థల ధ్రువీకరణ పత్రం అందజేత1
1/2

పీహెచ్‌సీకి స్థల ధ్రువీకరణ పత్రం అందజేత

పీహెచ్‌సీకి స్థల ధ్రువీకరణ పత్రం అందజేత2
2/2

పీహెచ్‌సీకి స్థల ధ్రువీకరణ పత్రం అందజేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement