
అదే వరుస.. అదే గోస
న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 10 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
రైతులకు తప్పని యూరియా తిప్పలు
చేగుంట(తూప్రాన్)/నర్సాపూర్/మనోహరాబాద్ (తూప్రాన్)/తూప్రాన్/శివ్వంపేట(నర్సాపూర్): ప్రభుత్వ వైఫల్యం.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. బస్తా యూరియా కోసం గంటల తరబడి నిరీక్షించినా ఫలితం లేకుండా పోతోంది. పొలాల్లో ఉండాల్సిన రైతులు.. యూరియా కోసం చక్కర్లు కొడుతున్నారు. మంగళవారం యూరియా వస్తుందని సమాచారం తెలుసుకున్న రైతులు.. చేగుంటలో భారీ క్యూ కట్టారు. వ్యవసాయ అధికారులు టోకె న్లు అందించి 890 బస్తాల యూరియాను అందించారు. నర్సాపూర్‌లో మంగళవారం తెల్లవారు జా ము నుంచే రైతు వేదిక వద్ద క్యూ కట్టారు. మనోహరాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద టోకెన్‌లు అందజేయడంతో రైతులు ఉదయం నుంచే బారులు తీరారు. 350 మందికి టోకెలు అందజేశా రు. వీరికి రెండు రోజుల్లో యూరియా బస్తాలను అందజేస్తామన్నారు. తూప్రాన్ పట్టణంలోని రైతు ఆగ్రో సేవా కేంద్రం వద్ధకు పెద్ద సంఖ్యలో రైతులు చేరుకున్నారు. యూరియా లేదని తెలియడంతో రోడ్డుపై భైఠాయించి రాస్తారోకో చేపట్టారు. దీంతో రోడ్డుకు ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి.
శివ్వంపేట ప్రాథమిక సహకార సంఘం వద్ద యూరియా కోసం సోమవారం అర్ధరాత్రి నిద్రపోతున్న వారికి పోలీసులు నచ్చజెప్పి ఇళ్లకు పంపించి వేశారు. మంగళవారం ఉదయం కూడా పలు గ్రామాల నుంచి రైతులు వచ్చినప్పటికి యూరియా రావడం లేదని చెప్పడంతో రైతులు వెనుతిరిగి వెళ్లారు.