
చిన్న కారణాలతో రోగులను బయటకు పంపొద్దు
ఎమ్మెల్యే సునీతారెడ్డి
ఉపాధ్యాయులకు సన్మానం
● త్వరలో గైనకాలజిస్ట్ పోస్టు మంజూరు ● వీవీపీ కోఆర్డినేటర్ శివదయాల్ ● ప్రభుత్వ ఆసుపత్రి సందర్శన
రామాయంపేట(మెదక్): విషజ్వరాలతో విలవిల’శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఆ శాఖ అధికారులు స్పందించారు. మంగళవారం వైద్య విధాన పరిషత్ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ శివదయాల్ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులతో మాట్లాడారు. వైద్య సేవలపై ఆరా తీశారు. రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో ఉన్న మందుల స్టాక్‌ను పరిశీలించిన అయన సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో మందుల కోసం ప్రైవేట్ మెడికల్ స్టోర్లకు రాయవద్దని చెప్పారు. నిరుపయోగంగా ఉన్న ఎక్స్‌రే యంత్రాన్ని వినియోగంలోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఆసుపత్రిలో ప్రసూతి వైద్య సేవలు అందడం లేదనే విషయమై ఆయన మాట్లాడుతూ.. త్వరలో గైనకాలజిస్ట్ పోస్టును మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. చిన్న చిన్న కారణాలతో రోగులకు బయటకు పంపవద్దని డాక్టర్ శివదయాల్ ఆదేశించారు. ఆసుపత్రిలో మందుల కొరత లేదన్నారు. ఆయనతో పాటు సూపరింటెండెంట్ డాక్టర్ లింబాద్రి తదిరులు ఉన్నారు.
‘గురు’తర బాధ్యత మీదే
శివ్వంపేట(నర్సాపూర్): సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి ప్రత్యేక గుర్తింపు ఉందని ఎమ్మెల్యే సునీతారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ సుహాసినిరెడ్డి అన్నారు. గురుపూజోత్సవ సందర్భంగా మండలంలోని ఉత్తమ ఉపాధ్యాయులను మంగళవారం ఎంపీడీఓ సమావేశ మందిరంలో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు అంకిత భావంతో విధులు నిర్వహిస్తూ విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడంలో కీలక భూమిక వహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి విద్యార్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచి ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా పాటుపడాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ కమలాద్రి, ఎంపీ డీఓ వెంకటలక్ష్మమ్మ, ఎంఈఓ బుచ్చానాయక్, జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు భారతికోడె, శ్రీనివాస్, వివిధ పార్టీల నాయకులు మన్సూర్, గంగాధర్,వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, తదితరులు ఉన్నారు.

చిన్న కారణాలతో రోగులను బయటకు పంపొద్దు