
ప్రజావాణిని సద్వినియోగం చేసుకోండి
మెదక్ మున్సిపాలిటీ: ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సూచించారు. సోమవారం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా 13 మంది తమ తమ సమస్యలపై ఫిర్యాదులు అందజేయగా, వాటిని చట్ట ప్రకారం పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే పలు ఉత్సవ కమిటీలపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. వినాయక నిమజ్జన ఉత్సవం సందర్భంగా కానిస్టేబుల్‌తో దురుసుగా ప్రవర్తించిన పెద్దబజార్‌కు చెందిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.