
సీజనల్‌పై అప్రమత్తంగా ఉండాలి
కలెక్టర్ రాహుల్‌రాజ్
పాపన్నపేట(మెదక్): సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. ఆదివారం పాపన్నపేట పీహెచ్‌సీ, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్పత్రికి వచ్చే ప్రతి ఒక్కరికి మెరుగైన సేవలు అందించాలని పేర్కొన్నారు. అనంతరం ఆస్పత్రి రికార్డులు పరిశీలించి వైద్య సేవలపై ఆరా తీశారు. ఆయన వెంట అధికారులు, సిబ్బంది ఉన్నారు.
పనుల్లో వేగం పెంచండి
మెదక్ మున్సిపాలిటీ: ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ పంచాయతీరాజ్ ఇంజనీర్‌ను ఆదేశించారు. ఆదివారం పట్టణంలో భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ. 5 కోట్లతో నిర్మిస్తున్న పనుల్లో వేగం కనిపించడం లేదన్నారు. నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.