
సేవలే చిరస్థాయిగా నిలుస్తాయి
ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్: విధి నిర్వహణలో చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచి ఉంటాయని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్ పదవీ విరమణ సభకు హాజరై మాట్లాడారు. లక్ష్మణ్ సాధారణ ఉపాధ్యాయుడి నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగారని కొనియాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎంతగానో సేవ చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్‌రెడ్డి, మాజీ అధ్యక్షులు శేరి వెంకట్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు మాణయ్య, రాష్ట్రంలోని అన్ని జిల్లాల పీఆర్టీయూ అధ్యక్ష, కార్యదర్శులు, సంఘాల బాధ్యులు పాల్గొన్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో పలువురికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.