
రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించండి
ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి
పెద్దశంకరంపేట(మెదక్): ఉపాధ్యాయ, ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం పెద్దశంకరంపేటలో మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. 5 డీఏలను వెంటనే విడుదల చేయాలన్నారు. పీఆర్‌సీ అమలుతో పాటు ఏకీకృత సర్వీస్ నిబంధనలు అమలు చేసి ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని కోరారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు పీఆర్టీయూ వ్యతిరేకమన్నారు. అన్ని పాఠశాలల్లో ప్రీ ప్రైమరీని ప్రారంభించాలన్నారు. అన్ని పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించి విద్యాభివృద్ధికి తోడ్పడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో పీఆర్టీయూ రాష్ట్ర నాయకులు దామోదర్‌రెడ్డి, వంగా మహేందర్‌రెడ్డి, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు శశిధర్‌శర్మ, మాజీ అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, శ్రీనివాస్, వేమారెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఆశయ్య, రామచంద్రాచారి, ఉపాధ్యాయులు గోపి, ప్రసన్న, సంతోష్, కిషోర్‌చారి, పాండు తదితరులు పాల్గొన్నారు.