
ఉప్పొంగంగా..!
ఏడు మండలాల్లో 5 మీటర్ల లోతులోనే..
మెదక్‌జోన్: మెతుకుసీమలో సమృద్ధిగా వర్షాలు కురిశాయి. చెరువులు, కుంటలు నిండాయి. వాగులు జలకళను సంతరించుకున్నా యి. వెరసి జిల్లా అంతటా భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. సాధారణం కంటే 90 శాతం అధిక వర్షపాతం నమోదు కావడంతో పాతాల గంగ ౖపైపెకి ఉబికివస్తోంది. జిల్లాలో సగటున 11.11 మీటర్ల లోతులో నీటిమట్టం ఉండగా, ఏడు మండలాల్లో ఏకంగా 5 మీటర్ల లోతులో ఉంది.
గతేడాదితో పోలిస్తే 2.19 మీటర్లు పైకి..
జిల్లాలో జూన్, జూలైలో లోటు వర్షపాతం ఉండగా, ఆగస్టు చివరివారంలో కుంభవృష్టి వాన కురిసింది. అత్యధికంగా హవేళిఘణాపూర్ మండలంలో 31 సెంటీమీటర్లు నమోదు అయింది. అలాగే నిజాంపేట, రామాయంపేట, మెదక్, నార్సింగి, పెద్దశంకరంపేట, చిన్నశంకరంపేట, రేగోడ్, కొల్చారం, పాపన్నపేట, శివ్వంపేట మండలాల్లో సైతం భారీ వర్షాలు నమోదయ్యాయి. జిల్లాలో ఏకై క మధ్య తరహా ప్రాజెక్టు ఘనపూర్‌తో పాటు హల్దీ, మంజీరా, రాయినిపల్లి ప్రాజెక్టు, అతిపెద్ద చెరువు కోంటూర్‌తో పాటు 2,632 నీటి వనరులు నిండుకుండలా మారాయి. ఈ వర్షాకాలంలో గత మూడు నెలల వరకు సాధారణ వర్షపాతం 518.4 మి.మీ కాగా, 985.5 మి.మీ కురిసింది. ఈలెక్కన సాధారణం కంటే 467.1 మి.మీ వర్షం అధికంగా కురిసింది. దీంతో భూగర్భజలాలు కనీవినీ ఎరుగని రీతిలో పెరిగాయి. గతేడాది ఆగస్టులో జిల్లాలో సగ టున 13.30 మీటర్ల లోతులో జలం ఉండగా, ఈ ఏడాది 11.11 మీటర్లలో ఉన్నాయి. ఈ లెక్కన గతేడాదితో పోలిస్తే 2.19 మీటర్ల పైకి భూగర్భజలాలు పైకి వచ్చాయి.
జిల్లాలోని ఏడు మండలాలతో పాటు జిల్లా కేంద్రంలోనూ కేవలం ఐదు మీటర్లలోతులో భూగర్భజలాలు ఉన్నాయి. శివ్వంపేట మండలం సికింద్లాపూర్‌లో 0.30 మీటర్లు, మె దక్ పట్టణ శివారులోని పిల్లికొటాల్‌లో 1.74, హవేళిఘణాపూర్ మండలం కూచన్‌పల్లిలో 2.85, పాపన్నపేట మండలం ఎల్లుపేటలో 2.99, మెదక్ మండలం పేరూర్‌లో 3.80, వెల్దుర్తి మండలం రామయిపల్లిలో 4.02, రామాయంపేటలో 4.90 మీటర్ల లోతులో నీటిమట్టం ఉంది. కాగా జిల్లాలో 4 లక్షల ఎకరాల మేర సాగుకు అనుకూలమైన భూములు ఉండగా, 3.95 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. ఈ ఏడాది వర్షాకాలంలో 3.30 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. వాటిలో 2.80 లక్షల ఎకరాల్లో వరిసాగు చేయగా, 50 వేల ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగు చేశారు. కాగా 80 శాతం బోరుబావుల ఆధారంగానే పంటలు సాగు చేయగా, కేవలం 20 శాతం మంది రైతులు మాత్రమే సాగునీటి వనరుల ఆధారంగా వ్యవసాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖరీఫ్‌తో పాటు వచ్చే యాసంగి పంటల సాగుకు సైతం ఎలాంటి ఢోకా లేదని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో గణనీయంగా పెరిగిన భూగర్భజలాలు
సగటున 11.11 మీటర్ల లోతులో నీటిమట్టం
సాధారణం కంటే 90 శాతం అధిక వర్షపాతం
బోర్ల ద్వారా సమృద్ధిగా పంటలకు నీరు