
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
చేగుంట(తూప్రాన్): యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. చేగుంట– మెదక్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వ్యవసాయశాఖ అధికారులు యూరియా వస్తుందని తెలియజేయడంతో గురువారం ఉదయమే రైతువేదిక వద్దకు చేరుకున్నారు. తీరా స్టాక్ రాలేదని తెలపడంతో ఆగ్రహించి రోడ్డుపై బైఠాయించారు. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ.. చేగుంటకు 2 లారీల యూ రియా వచ్చినట్లు సమాచారం ఉందని, వెంటనే అందించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని టోకెన్లు ఇప్తిస్తానని, లోడ్ రాగానే యూరియా తీసుకెళ్లాలని సముదాయించడంతో రైతులు ఆందోళన విరమించారు.