
కేంద్ర నిధులతోనే ఆర్వోబీ నిర్మాణం
చేగుంట(తూప్రాన్): వందశాతం కేంద్ర నిధులతో చేగుంట– మెదక్ రైల్వేగేటు వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నట్లు ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు. గురువారం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. 2016లో ఆర్వోబీ మంజూరైనా, గత ప్రభుత్వం రాష్ట్ర వాటా నిధులు అందించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే రాష్ట్ర వాటా అందిస్తే నిర్మాణం చేపడతామని కేంద్రం ప్రకటించిందన్నారు. డబ్బులు చెల్లించలేమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించడంతో కేంద్రంలోని పెద్దలను ఒప్పించి వందశాతం కేంద్ర నిధులు కేటాయించేలా కృషి చేసినట్లు వివరించారు. రూ. 48.77 కోట్లతో ఆర్వోబీ నిర్మాణం జరుగుతుందన్నారు. వడియారం రైల్వేస్టేషన్‌లో అదనపు ప్లాట్‌ఫాం నిర్మాణం, దేవగిరి, రామలసీమ ఎక్స్‌ప్రెస్ రైళ్ల నిలుపుదల, రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేయాలని డివిజినల్ రైల్వే మేనేజర్ సంతోష్‌కుమార్‌వర్మను ఎంపీ కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీకాంత్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ రఘునందన్‌రావు